భారతదేశం, ఫిబ్రవరి 21 -- తిరుమల లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోడానికే హెరిటేజ్ సంస్థపై వైసీపీ నిందలు వేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుల్ని నడి రోడ్డుపై నిలబెడతామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 2024లో అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన ప్రారంభించామని అన్నారు.

నెయ్యి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపిస్తే కల్తీ జరిగినట్లు నివేదిక అందించిందని.. అది అసలు నెయ్యి కాదని తేలిందని స్పష్టం చేశారు. రసాయనాలతో నెయ్యి తయారు చేసి ప్రసాదంలో వినియోగించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ తన నివేదికలో కూడా పేర్కొందని స్పష్టం చేశారు.

వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్ర...