భారతదేశం, మే 23 -- కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని.. మైలవరం మండలం కంబాలదిన్నేకు బంధువుల పెళ్లికి వెళ్లారు. తమ మూడేళ్ల కుమార్తె పెళ్లి మండపం బయట ఆడుకుంటుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి.. బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అత్యాచారం విషయం బయటపడుతుందని.. బాలికను దారుణంగా హత్య చేశాడు. అయితే.. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీపంలో గాలించారు. ఈ క్రమంలో ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎగువ రామాపురానికి చెందిన శివ రామకృష్ణారెడ్డి అదే గ్రామానికి చెందిన అంకిరెడ్డికి డబ్బు బ...