భారతదేశం, జూన్ 14 -- తెలుగు మూవీ డియ‌ర్ ఉమ ఓటీటీలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మెడికో థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ శుక్ర‌వారం స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. విడుద‌ల రోజే ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. స‌న్ నెక్స్ట్ ఓటీటీలో టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల్లో ఒక‌టిగా డియ‌ర్ ఉమ నిలిచింది.

డియ‌ర్ ఉమ మూవీలో సుమయా రెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తూ ఈ సినిమాను నిర్మించింది. అంతే కాకుండా ఈ సినిమా క‌థ‌. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా సుమ‌యా రెడ్డినే అందించింది. పృథ్వీ అంబర్ హీరోగా న‌టించిన ఈ మూవీకి సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. కార్పొరేట్ వైద్య రంగంలోని లోపాల‌ను ఎత్తిచూపుతూ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా డియ‌ర్ ఉమ మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ ర‌ధ‌న్ మ్యూజిక్ అందించాడు. హీరోయిన్...