భారతదేశం, ఫిబ్రవరి 6 -- "ఒక్క ఫోన్ కాల్.. ఒక మెట్ల వరుస.. ఒక్క చిన్న అజాగ్రత్త.. ఇది చాలు ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేయడానికి." అని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

ఫిబ్రవరి 4న పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మెట్లు దిగుతూ అదుపుతప్పి కింద పడి ఫ్రాక్చర్‌కు గురైన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అక్కడే ఉన్న అధికారులు వెంటనే స్పందించి ఆయనను పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను శశి థరూర్ స్వయంగా పంచుకున్నారు. అయితే, ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ సుధీర్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు.

చాలామంది నడుస్తూనో, మెట్లు దిగుతూనో ఫోన్ మాట్లాడటం గొప్ప విషయంగా భావిస్తారు. కానీ, మన మెదడు ఒకేసారి రెండు పనులు చేయడం...