భారతదేశం, జూలై 29 -- పిల్లల కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదా? అలాంటి వారికి ఇంట్రాటెరిన్ ఇన్‌సెమినేషన్ (IUI) లేదా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (IVF) అనే రెండు పునరుత్పత్తి సహాయక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి గర్భం ధరించే ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్దేశించినవి అయినప్పటికీ, రెండింటికీ వేర్వేరు ప్రయోజనాలు, ఇబ్బందులూ ఉన్నాయి. మీ ప్రత్యేక పరిస్థితులకు ఏది సరిపోతుందో వైద్యులు మీకు సలహా ఇస్తారు.

ఈ సంతానోత్పత్తి చికిత్సల గురించి మీకు ఆందోళనగా లేదా అయోమయంగా ఉందా? లేదా సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించాలా వద్దా అని సందేహంగా ఉందా? ఈ రెండు ప్రసిద్ధ పద్ధతుల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలను ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ నీలం సూరి HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్...