భారతదేశం, ఫిబ్రవరి 17 -- సినిమాల పైరసీ కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ రవికి ఊరట దొరికింది. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఐబొమ్మతో ముడిపడి ఉన్న సినిమా పైరసీ, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రకటనల నెట్‌వర్క్‌కు సంబంధించి నవంబర్ 15న ఇమంది రవి అరెస్ట్ అయ్యాడు. అయితే తాజాగా రవికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

భారతదేశంలోని అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు రవిని నవంబర్ 15వ తేదీన అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం.. ఈ నెట్‌వర్క్ ద్వారా వేల సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను ఐబొమ్మలో అప్‌లోడ్ చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రొత్సహించాడు.

తాజాగా ఇమంది రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పో...