భారతదేశం, అక్టోబర్ 30 -- మెుంథా తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏపీ తీరందాటినా దాని ప్రభావం ఇంకా తగ్గడం లేదు. దీంతో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. కృష్ణా ఉపనదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల అభివృద్ధి శాఖ ప్రకటన జారీ చేసింది.

తుపాను ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ప్రాజెక్టులు, నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలి...