Andhrapradesh, జూన్ 28 -- ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతి విద్యాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

జూన్ 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. ప్రస్తుతం ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు మాత్రం జూన్ 30వ తేదీ నుంచే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.

ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలి...