Andhrapradesh, మే 31 -- ఏపీ పదో తరగతి వాల్యుయేషన్‌లో లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ఫలితాలు విడుదలైన తర్వాత.. రీకౌంటింగ్, రీవెరిఫిషన్ కు ఈ ఏడాది 34,709(66,363 పేపర్లు) మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీటిల్లో 10,159 మంది విద్యార్థులకు సంబంధించిన 11,175 జవాబుపత్రాల్లో మార్కులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో 18 శాతం వ్యత్యాసం నమోదైందనట్లు పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తుల విషయంలో.. 2019 లో 19 శాతంగా, 2022లో 20 శాతం, 2023లో 18 శాతం, 2024లో 17 శాతం ఉందని వివరించింది.

పదోతరగతి విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసంపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఐదు మందిని సస్పెండ్ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నేపథ్యంలో.. ఆర్ జెయు కెటిల్లో దరఖాస్తులకు గడువును జూన్ 5 నుంచి జూన్ 10వతేదీ వరకు పొడిగించారు. స్పెషల్ రీఅప్లి...