భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులు. ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

15 నుంచి 17 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అలాగే ఈ నెల 16 నుంచి 20 వరకు మరో విడత కూడా.. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇంకా చాలా మంది పి...