Andhrapradesh, ఏప్రిల్ 24 -- ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇవాళ నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.6degC, విజయనగరంలో 42.8degCచొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే 139 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించింది.

శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు. విజయనగరం-5 ,మన్యం -8 మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉంది. 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శని,ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు...