భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది.మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం భారీ రహదారిని నిర్మించనుంది. ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ కోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం.. NH-65, 216 జంక్షన్‌ నుంచి మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు మంజూరు నిర్ణయాన్ని ఆమోదించారు . 6 వరుసల ప్రధాన హైవేతోపాటు, సర్వీస్‌ రోడ్లు, మూడు చోట్ల ఫ్లైఓవర్లు, ఓ రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్టు - జాతీయ రహదారి కారిడార్ మధ్య అనువైన కెనక్టివిటీని ఏర్పాటవుతుంది. సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించటంత...