భారతదేశం, జనవరి 1 -- తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది, చలి గాలుల కారణంగా జనాలు తగ్గుముఖంపట్టిన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో థర్మామీటర్లు సింగిల్ డిజిట్‌కు పడిపోయినందున చాలా మంది బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. వివిధ ప్రాంతాలలో చలిగాలుల పరిస్థితులు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనిపై వాతావరణ శాఖ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాలలో చలి పరిస్థితులు తీవ్రమవుతాయని, మరికొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.

ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ప్రస్తుతం ఉత్తరం నుండి ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం నివేదించింది. రాబోయే మూడు రోజుల సూచన చెప్పింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని అం...