భారతదేశం, ఆగస్టు 8 -- దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ.10,987 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.10,461 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,10,910 కోట్ల నుంచి రూ.2,22,864 కోట్లకు పెరిగిందని ఎల్ఐసీ తెలిపింది.

కొత్త పాలసీ ప్రీమియం రూ.7,470 కోట్ల నుంచి రూ.7,525 కోట్లకు పెరిగింది. పాత పాలసీ రెన్యువల్ ప్రీమియం ద్వారా రూ.59,885 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో ఎల్ఐసీ పెట్టుబడి ఆదాయం రూ.96,183 కోట్ల నుంచి జూన్ త్రైమాసికంలో రూ.1,02,930 కోట్లకు పెరిగింది.

మొదటి త్రైమాసికంలో మొ...