భారతదేశం, డిసెంబర్ 29 -- అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అగ్నిప్రమాదం గురించి తమకు అర్ధరాత్రి 12:45 గంటలకు సమాచారం అందిందని చెప్పారు.

రైలులో మంటలు చెలరేగినప్పుడు ప్రభావితమైన ఒక కోచ్‌లో 82 మంది ప్రయాణికులు, మరో కోచ్‌లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారి విలేకరులకు వెల్లడించారు. దురదృష్టవశాత్తు B1 కోచ్ నుండి ఒక మృతదేహం లభ్యమైంది అన్నారు. మృతుడిని చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు. దెబ్బతిన్న రెండు కోచ్‌లను రైలు నుండి వేరు చేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపే ప్రయత్నంలో ఉన్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి రెండు ఫోరెన్సిక్ బృందాలు పనిచేస...