భారతదేశం, జూన్ 18 -- మీరు జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామాలు (strength training) చేసినప్పుడు, కేవలం కండరాల ద్రవ్యరాశిని పెంచుకోవం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా దీర్ఘాయువు రహస్యాన్ని కూడా తెలుసుకుంటారని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ అంటున్నారు. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం జీవించడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం. కండరాలను పెంచుకోవడం దీనికి ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చునని చెబుతున్నారు.

జూన్ 17న షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కండరాలు దీర్ఘాయువుకు ఎందుకు ముఖ్యమైన అవయవమో డాక్టర్ జెరెమీ వివరించారు. 'మనం వయసు పెరిగే కొద్దీ పురుషులు, స్త్రీలు ఇద్దరూ కండర ద్రవ్యరాశిని కోల్పోతారు. వృద్ధాప్యంలో బలహీనంగా మారకుండా ఉండటానికి మనం ప్రయత్నిస్తాం..' అని వివరించారు.

మరి కండర ద్రవ్యరాశిని కాపాడుకోవడం మొదలుపెడితే ఏం జరుగుతుంది?...