భారతదేశం, జూలై 24 -- పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం. ఈ రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యం చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించింది.

ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్...