భారతదేశం, జూన్ 29 -- త్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చార్‌ధామ్ యాత్రపై మాట్లాడారు. భారీ వర్షాల హెచ్చరిక దృష్ట్యా చార్‌ధామ్ యాత్రను రాబోయే 24 గంటలు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. దీనితో పాటు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్‌లలో యాత్రికులను ఆపాలని పోలీసులు, పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.

యాత్రను రాబోయే 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్టు, పోలీసులు, పరిపాలన అధికారులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చామని శంకర్ పాండే అన్నారు. ఈ సమయంలో హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్‌లలో యాత్రికుల రాకపోకలను నిలిపివేస్తారు. తదుపరి ఉత్తర్వు వచ్చే వరకు ఈ యాత్ర వాయిదా పడుతుంది.

ఉత్తరకాశ...