భారతదేశం, నవంబర్ 8 -- రోజువారీ అవసరాల వస్తువులను తీసుకొని, వాటిని భారీ ధరకు మార్కెట్లోకి తీసుకురావడంపై లగ్జరీ బ్రాండ్‌లు కొత్తగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది! డిజైనర్ పేపర్ బ్యాగులు, చెప్పులు, లంచ్‌బాక్స్‌ల తర్వాత.. ఇప్పుడు లగ్జరీ సేఫ్టీ పిన్స్ మార్కెట్​లో కొత్తగా విడుదలై వార్తల్లో నిలిచాయి. వీటి ధర తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే! ప్రాడా అనే సంస్థ ఏకంగా 775 డాలర్లకు (రూ. 68758) ఒక సేఫ్టీ పిన్​ని తీసుకొచ్చింది.

ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్ అయిన ప్రాడా.. "క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్" అని పిలుస్తున్న ఒక వస్తువును విడుదల చేసింది. ఇది ప్రాథమికంగా, రంగురంగుల క్రోచెట్ దారంతో చుట్టిన సాధారణ సేఫ్టీ పిన్. దానికి పైన సిగ్నేచర్ ప్రాడా ట్రయాంగిల్ లోగో చార్మ్​ని యాడ్​ చేశారు. దీని ధర 775 డాలర్లు.

భారతదేశంలో.. సాధారణంగా 20 నుంచి 30 సేఫ్టీ పిన్‌ల...