Hyderabad, జూలై 20 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 20.07.2025 నుంచి 26.07. 2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: ఆషాడ మాసం/శ్రావణ మాసం, తిథి : కృ. దశమి నుంచి శ్రా. విదియ వరకు

మేష రాశి వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. భార్యాభర్తలు, సోదరులతో వివాదాలు కొలిక్కి రానుంది. సంతానవరంగా కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యలు తీరతాయి. ఆస్తులు కొనుగోలుపై మరింత దృష్టి సారిస్తారు. కొత్త పెట్టుబడులతో మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. భాగస్వాముల సలహాల మేరకు ఒక నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులు తాము కోరుకున్న మార్పులు దక్కించుకుంటారు.

విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత సానుకూలత ఉంటుంది. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. టెక...