భారతదేశం, ఏప్రిల్ 18 -- కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ గురువారం జరిమానాలు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.61.4 లక్షలు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై రూ.38.6 లక్షలు, పీఎన్‌బీపై రూ.29.6 లక్షల జరిమానా విధించింది. వినియోగదారులకు అందించే సేవలలో లోపాలు, నిబంధనల ఉల్లంఘనకు ఈ జరిమానా పడింది.

రుణ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్‌బీఐ రూ.61.4 లక్షల జరిమానా విధించింది. రుణ పంపిణీ వ్యవస్థ కోసం మార్గదర్శకాలు, రుణాలు, అడ్వాన్సులు చట్టబద్ధమైన, ఇతర పరిమితులు, ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ చర్య తీసుకున్నారు. రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆర్‌బిఐ నిర్దేశించిన నియమాలను సరిగ్గా పాటించలేదు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కేవైసీ నియమాలను ఉల్లంఘించింది. కేవైసీ అంటే కస్టమర్ల గురించి సమాచారాన్...