Telangana, జూలై 5 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 7వ తేదీన రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 8, 9 తేదీలో ఐసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను కల్పిస్తారు.

పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సీట్లను కేటాయిస్తారు. ర్యాంక్ ఆధారంగా వీటిని కేటాయిస్తారు. గత...