Andhrapradesh,telangana, ఆగస్టు 23 -- గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనికితోడు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే తాజాగా ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 25వ తేదీన బంగాళాఖాతంలోని ఒడిశా-బెంగాల్‌ తీరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో తెలుగు ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ ప్రభావంతో కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఈ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర...