భారతదేశం, డిసెంబర్ 11 -- మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు మెుదలయ్యాయి. 4,236 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరుగుతోంది. 37,562 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు, వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ పదవులకు 8,095 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 9,626 నామినేషన్లు వివిధ కారణాల వల్ల ఉపసంహరణ అయ్యాయి.

4,236 గ్రామ పంచాయతీలకు గాను, 395 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,834 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి, 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

అదేవిధంగా, 37,440 వార్డు పదవులకు, 9,633 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మిగిలిన వార్డు...