భారతదేశం, ఏప్రిల్ 27 -- కర్నూలు నగరంలో ఆర్టీసీ అధికారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కర్నూలు నగరానికి చెందిన షేక్షావలి మరో ఐదుగురు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దొంగతనానికి గురైన సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ వెల్లడించారు.

షేక్షావలి.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో ఓ హోటల్‌లో పనిచేస్తూ సంతోష్‌ నగర్‌లో ఉండేవాడు. జల్సాలకు అలవాటుపడిన షేక్షావలికి ఐదుగురు మైనర్లతో పరిచయం అయ్యింది. వీరిలో ఇద్దరు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడి గతంలోనే కర్నూలు తాలూకా పోలీసులకు చిక్కారు. ఆ తర్వాత కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ.. జల్సా జీవితం గడిపేవారు.

జల్సాలకు అలవాటుపడిన వీరందరూ.. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేసేవారు. పోలీసులకు చిక్కకుండా ఉండాలని.. యూట్యూబ్‌ చూసి రంపంతో తాళాలు కోయడం...