Hyderabad,telangana, సెప్టెంబర్ 28 -- మూసీ ఉప్పొంగింది..! గతంలో ఎప్పుడు లేనంతగా పరివాహక ప్రాంతాలన్నింటిని చుట్టుముట్టేసింది. నదిపై ఉన్న వంతెనల పైనుంచే కాదు. ఏకంగా ఎంజీబీఎస్ బస్టాండ్ ను కూడా ముంచెత్తింది. ఈ పరిణామంతో హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది. అధికారులు కూడా అంచనా వేయలేనిస్థితిలో మూసీ పారటంతో. స్థానికులు నిద్రలేని రాత్రులు గడిపారు.

సెప్టెంబర్​ 26, 2025 అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాల నుంచి భారీగా వరద వచ్చి చేరటంతో. గత కొన్నేళ్లుగా చూడని స్థాయిలో మూసీ నది జల ప్రళయం సృష్టించింది. ఎంజీబీఎస్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వీరందర్నీ క్షేమంగా బస్టాండ్ నుంచి బయటికి తరలించారు. ఇక పరివాహక ప్రాంతంలో ఉన్న చాలా ఇళ్లు నీట మునిగాయి....