భారతదేశం, ఆగస్టు 5 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల రూపంలో భారీ షాకిచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, 30 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలపై రూ. 17,000 కోట్ల భారం మోపిందని ఆమె విమర్శించారు.

"చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచను అని మాట ఇచ్చి, ప్రజలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే రూ. 17,000 కోట్ల భారాన్ని మోపి, ప్రజల జేబులకు చిల్లు పడేలా చేశారు" అని షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు.

అంతేకాకుండా, ఈ భారం సరిపోదన్నట్టుగా మరో రూ. 12,000 కోట్లను విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై మోపేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలపై విపరీతంగా విద్యుత్ ఛా...