Andhrapradesh,tirumala, జూలై 9 -- కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన టీటీడీ. ఇప్పుడు మరో సరికొత్త ఆలోచన చేస్తోంది. శ్రీవారి దర్శనం విషయంలో సాంకేతిక సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇదే విషయంపై మంగళవారం సమీక్షించిన ఆలయ ఈవో శ్యామలరావు. కీలక సూచనలు చేశారు.

టెక్నాలజీ సాయంతో నిర్దేశించిన సమయానికి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు టీటీడీ ఈవో శ్యామల రావు సూచించారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్.ఎస్.డి), ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్.ఈ.డి), దివ్యదర్శనం తదితర మార్గాల ద్వారా వస్తుంటారని గుర్తు చేశారు. సదరు భక్తులకు టెక్నాలజీ సాయంతో సకాలంలో దర్శనం చేయించడంపై తగు చర...