భారతదేశం, జనవరి 31 -- ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్​' కొత్త తరం డస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో పెద్ద అలజడినే సృష్టించింది. అయితే, భారతదేశంలో తన అదృష్టాన్ని మార్చుకోవడానికి కంపెనీ కేవలం ఈ ఒక్క మోడల్​పైనే ఆధారపడాలని అనుకోవడం లేదు. ఇకపై దూకుడు పెంచి, ప్రతి ఏటా కనీసం ఒక కొత్త మోడల్‌ను భారత మార్కెట్​లో లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా త్వరలోనే ఒక 7-సీటర్ ఎస్‌యూవీ రాబోతోందని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు డస్టర్​కి 'మినీ' వర్షెన్​ని కూడా సంస్థ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ మినీ డస్టర్​ని ప్రవేశపెట్టే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

"మినీ డస్టర్ అనేది చాలా మంచి ఆలోచన," అని రెనాల్ట్​ బ్రాండ్ సీఈఓ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫాబ్రిస్ కాం...