భారతదేశం, జనవరి 31 -- ఈ 2026లో భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ సరికొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా రూ. 20 లక్షల లోపు ధరలో వివిధ బ్రాండ్ల నుంచి అనేక కొత్త మోడళ్లు రాబోతున్నాయి. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటార్స్ వంటి అగ్రగామి సంస్థలు సామాన్య వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే మెరుగైన రేంజ్, అధునాతన ఫీచర్లు, సరసమైన ధరలతో ఈవీలను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 20లక్షల లోపు ధరలో, త్వరలోనే ఇండియా రోడ్ల మీద కనిపించే ఎలక్ట్రిక్​ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ నుంచి రాబోతున్న 'లిమో గ్రీన్' ఎలక్ట్రిక్​ కారు.. బీవైడీ ఇ-మాక్స్ 7కు పోటీగా నిలవనుంది. ఇది 5+2 మంది ప్రయాణించగల ఎంపీవీ. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ కారులో 60.1 కేడబ్ల్...