భారతదేశం, నవంబర్ 17 -- టాటా మోటార్స్​కి చెందిన ఐకానిక్​ సియెర్రా.. ఇప్పుడు సరికొత్తగా భారతీయుల ముందుకు రానుంది. ఈ టాటా సియెర్రా ఎస్‌యూవీ నవంబర్ 25న లాంచ్ కానుంది. కొన్ని డీలర్ల వద్ద ఇప్పటికే అనధికారిక బుకింగ్స్​ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రూ. 21వేల టోకెన్​ అమౌంట్​తో మీరు ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా మోటార్స్ సంస్థ 1990ల నాటి ఐకానిక్ సియెర్రా పేరును పునరుద్ధరిస్తూ, ఈ సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ కొత్త వెర్షన్ సమకాలీన స్టైలింగ్‌తో పాటు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రీమియం క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇది గతంలో కాన్సెప్ట్ రూపంలో, ఆ తర్వాత ఉత్పత్తికి ముందున్న రూపంలో పలుమార్లు కనిపించింది.

కొత్త సియెర్రాలో మూడు డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, రెండు క...