భారతదేశం, డిసెంబర్ 31 -- మీరు 2026 జనవరిలో కొత్త ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మార్కెట్లో మీకు చాలా ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ ఇస్తోంది. పర్యావరణంపై మక్కువ ఉంటే మారుతీ సుజుకీ నుంచి 'ఈ విటారా' ఎలక్ట్రిక్ కారు కూడా వస్తోంది. టాటా సియెర్రా బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, హారియర్, సఫారి పెట్రోల్ మోడల్స్ డెలివరీలు కూడా జనవరి నుంచే మొదలుకానున్నాయి.

అయితే, వీటన్నింటి మధ్య మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్​యూవీ 700ని సరికొత్త హంగులతో 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ' పేరుతో లాంచ్ చేస్తోంది. మునుపటి కంటే మెరుగైన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఇది రాబోతోంది. మరి ఈ కారు కొనాలా? వద్దా? కొన్ని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ చూడటానికి పాత ఎక్స్​యూవీ...