భారతదేశం, అక్టోబర్ 31 -- నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (యూజీ) రిక్రూట్‌మెంట్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇటీవలే ప్రారంభించాయి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్​ఆర్బీలు). ఈ పోస్టులకు రిజిస్టర్​ చేసుకోవడానికి ఆసక్తి, అర్హత కలగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన విండో నవంబర్ 27, 2025 వరకు తెరిచి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- నవంబర్ 29, 2025

అప్లికేషన్​ కరెక్షన్​ విండో- నవంబర్ 30, 2025 నుంచి డిసెంబర్ 9, 2025 వరకు

అర్హులైన అభ్యర్థులు రైటర్‌ వివరాలను సమర్పించడానికి- డిసెంబర్ 10 నుంచి 14, 2025 వరకు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు మొత్తం 3,058 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పోస్టుల వా...