భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశెపట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి, ఆర్థిక మంత్రి రూ.3,32,205 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా వేయగా.. రెవెన్యూ లోటు దాదాపు రూ.22,002 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు దాదాపు రూ.75,868 కోట్లుగా. రెవెన్యూ లోటు దాదాపు 1.11 శాతం ఉంటుంది. ఆర్థిక లోటు జీఎస్డీపీలో దాదాపు 3.84 శాతం ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులకు రూ.13,546, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.6,000 కోట్లు కేటాయించారు. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం ఉంటుందని ప్రకటించారు. ఇంధన రంగానికి రూ.13.934 కోట్లు కేటాయించింది. వార్షిక బడ్జెట్‌ను హోంమంత్రి అనిత శాసన మండలిలో సమర్పించారు. అంతకుముందు ముఖ...