భారతదేశం, జనవరి 5 -- అసోంలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు, మోరిగావ్​లో భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మోలాజీ (ఎన్​సీఎస్​) ధ్రువీకరించింది.

ఎన్​సీఎస్​ ప్రకారం భూమికి 50 కి.మీల లోతున ఈ భూకంపం ఏర్పడింది. అసోంలోని అనేక జిల్లాలతో పాటు మేఘాలయలోని షిల్లాంగ్​ వరకు కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.

అసోం భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ భూకంపంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అసోం భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission f...