భారతదేశం, ఏప్రిల్ 28 -- రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మే 2న రాష్ట్రానికి వస్తున్నారు. పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేయింబవళ్లు వందలాది మంది పనిచేస్తున్నారు. ప్రధాన వేదిక తోపాటు.. మిగిలిన వేదికలు, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి.

1.ప్రస్తుతం పైలాన్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే సభికులను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణంలో పెద్దఎత్తున కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు.

2.వాహనాలు నిర్దేశిత పార్కింగ్‌ ప్రదేశాల్లో మాత్రమే నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు సభాస్థలి వద్ద ఉండి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

3.ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో.. ఏర్...