భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో జోరు వర్షాలు పడ్డాయి. దాని ప్రభావం తగ్గుతుందనేలోపే మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేసింది.

సోమవారం, మంగళవారం ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్లు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోనూ సోమవారం, మంగళవారం మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు...