భారతదేశం, మే 31 -- పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఓ కుటుంబం గతేడాది సెప్టెంబర్‌లో కారు బుక్‌ చేసుకుని బందరు బీచ్‌కు వెళ్లారు. ఆ కారు డ్రైవర్‌ రాజు.. అక్కా అంటూ కారులోని మహిళతో వరుస కలిపాడు. బీచ్‌కు వెళ్లిన తర్వాత.. మహిళ కుమార్తెతో మాటలు కలిపి ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. అప్పటి నుంచి బాలికకు ఫోన్‌ చేసి ప్రేమిస్తున్నానని వేధించేవాడు. కొంతకాలం తర్వాత మాయమాటలు చెప్పి బాలికకు వీడియో కాల్‌ చేశాడు. నగ్న చిత్రాలు సేకరించాడు. ఆ తర్వాత అసలు బుద్ధి ప్రదర్శించాడు.

ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లిదండ్రులకు రాజు ఫోన్‌ చేశాడు. 'మీ అమ్మాయి నాకు న్యూడ్‌ ఫొటోలు పంపింది. అవి బయటకు పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి' అని డిమాండ్‌ చేశాడు. దీంతో భయపడి.. అతనికి రూ.20 వేలు పంపారు. ఆ తర్వాత ఫొటోలు ఎందుకు పంపావని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. అ...