Hyderabad, ఏప్రిల్ 21 -- Zee5 OTT Releases: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో జీ5 కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఈ ఓటీటీ కూడా కాస్త దూకుడు పెంచుతోంది. ఆర్ఆర్ఆర్, సంక్రాంతికి వస్తున్నాంలాంటి బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఈ ఓటీటీలోకి ఈ మధ్యే ఐదు థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ జానర్ సినిమాలు వచ్చాయి.

లాగౌట్ (Logout) ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ నటించిన మూవీ ఇది. ఈ తరం యువతను సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ఓ వ్యసనంలా మారి ఎలా వేధిస్తోందో ఈ సినిమా ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. 10 మిలియన్ ఫాలోవర్ల కోసం తాపత్రయ పడే ప్రత్యూష్ దువా (బాబిల్ ఖాన్) అనే ఓ యువకుడి ఫోన్ ను అతని అభిమానే చోరీ చేసి అతనితో ఎలా ఆడుకున్నదనేదే ఈ సినిమా స్టోరీ.

దావీద్ ఓ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ....