భారతదేశం, మార్చి 27 -- ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించింది. హెడ్ కోచ్ గా గంభీర్ ఓ ట్రోఫీ అందించాడు. ఈ విజయంతో దేశమంతా ఊగిపోయింది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేసిన గంభీర్.. ఇప్పుడు దొరికిన ఖాళీ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాజాగా తన వైఫ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై గంభీర్ సహచర ఆటగాడు, దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2025 జరుగుతున్న నేపథ్యంలో గంభీర్ కు ఖాళీ టైమ్ దొరికింది. దీంతో భార్యా, పిల్లలతో కలిసి గంభీర్ వెకేషన్ కు వెళ్లాడు. టెన్షన్ ను దూరం పెట్టి.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. తన వైఫ్ తో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీనికి యువరాజ్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. హిందీలో "తు న హసియో (నీవు నవ్వవు)'' ...