భారతదేశం, మార్చి 6 -- యూట్యూబ్​లో యాడ్​-ఫ్రీ కంటెంట్​ కోసం ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రీమియం ధరలను తగ్గిస్తూ మరో కొత్త ప్లాన్​ని తీసుకొచ్చింది దిగ్గజ వీడియో స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్​. దీని పేరు యూట్యూబ్​ ప్రీమియం లైట్​. ఈ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ని అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్​ ప్రీమియం లైట్​ సబ్​స్క్రిప్షన్ ధర నెలకు 7.99 డాలర్లు ( సుమారురూ. 696). ఇది సాధారణ యూట్యూబ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ (నెలకు $ 13.99) కంటే గణనీయంగా తక్కువ. ప్రీమియం లైట్​తో గేమింగ్, ఫ్యాషన్, బ్యూటీ, న్యూస్ వంటి కేటగిరీలు సహా విస్తృత శ్రేణి వీడియోలను యాడ్​-ఫ్రీగా చూడవచ్చు. అయితే, మ్యూజిక్​ మాత్రం ఇది వర్తించదు. అంటే.. యాడ్​-ఫ్రీ మ్యూజిక్​ కంటెంట్​ కోసం యూట్యూబ్​ ప్రీమియంనే ఎంచుకోవాలి.

తక్కువ ధరకు యాడ్​-ఫ్రీ కంటెం...