భారతదేశం, సెప్టెంబర్ 30 -- యూట్యూబ్ తన ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్​ని భారతదేశంలో ప్రారంభించింది. ఇది బడ్జెట్​ ధరలో యాడ్​-ఫ్రీ కంటెంట్​ని పొందాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్​. ఈ యూట్యూబ్​ ప్రీమియం లైట్​ సబ్​స్క్రిప్షన్​ ధర నెలకు రూ. 89! మాత్రమే!

ప్రీమియం లైట్ ముఖ్యంగా గేమింగ్, బ్యూటీ, ఫ్యాషన్, వార్తలు వంటి కేటగిరీల్లోని చాలా వరకు వీడియోల నుంచి ప్రకటనలను తొలగిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ప్రామాణిక ప్రీమియం ప్లాన్ మాదిరిగా కాకుండా, లైట్ ప్లాన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు లేదా యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్ వంటి అదనపు ఫీచర్లు ఉండవు! అంతేకాకుండా వీక్షకులు షార్ట్‌లు, మ్యూజిక్‌కు సంబంధించిన కంటెంట్, సెర్చ్ ఫలితాలు లేదా బ్రౌజింగ్ పేజీల్లో ప్రకటనలను చూసే అవకాశం ఉంది.

యూట్యూబ్ ప్రీమియం లైట్ స్మార్ట్‌ఫ...