భారతదేశం, అక్టోబర్ 16 -- అమెరికా సహా పలు ఇతర దేశాల్లో యూట్యూబ్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది యూజర్లకు ఈ ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​​ పనిచేయలేదు. యూట్యూబ్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డిటెక్టర్ ప్లాట్‌ఫామ్ సైతం చూపించింది. దాదాపు 2,03,763 మంది యూజర్లు యూట్యూబ్​ పనిచేయడం లేదని నివేదించారు. ఫలితంగా ఇతర సోషల్​ మీడియా వేదికల్లో యూట్యూబ్​పై మీమ్స్​, జోక్స్​ వెల్లువెత్తుతున్నాయి.

యూట్యూబ్ ప్రధాన సేవలే కాకుండా, ఆ సంస్థకు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, అలాగే యూట్యూబ్ టీవీలలో కూడా వేలాది మంది యూజర్లు అంతరాయాన్ని ఎదుర్కొన్నారు.

యూట్యూబ్ మ్యూజిక్‌లో 4,873 మందికి పైగా యూజర్లు అంతరాయాన్ని నివేదించారు. యూట్యూబ్ టీవీలో 2,379 మందికి పైగా సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

యూట్యూబ్​ డౌన్​ అవ్వడంతో యూజర్ల...