భారతదేశం, ఫిబ్రవరి 19 -- Xiaomi 14 pro price in India : షావోమీ 14 ఇండియా లాంచ్​ డేట్​.. ఎట్టకేలకు ఫిక్స్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ని.. మార్చ్​ 7న ఇండియాలో లాంచ్​ చేయనున్నట్టు దిగ్గజ టెక్​ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ షావోమీ 14 సిరీస్​లోని ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఈ షావోమీ 14 సిరీస్​.. చైనాలో గతేడాది అక్టోబర్​లో లాంచ్​ అయ్యింది. ఇక అంతర్జాతీయ మార్కెట్​లో ఈ నెల 25న లాంచ్​కానుంది. ఇక ఇండియాలో మార్చ్​ 7న లాంచ్​ అవ్వనుంది.

షావోమీ 14 సిరీస్​లో మొత్తం మూడు స్మార్ట్​ఫోన్స్​ ఉంటాయి. అవి.. షావోమీ 14, షావోమీ 14 ప్రో, షావోమీ 14 ప్రో అల్ట్రా. ఇండియాలో లాంచ్​ అవుతున్న గ్యాడ్జెట్స్​కి సంబంధించిన ఫీచర్స్​ని సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ.. చైనాలో ఉన్న ఫీచర్స్​ని చూస్తే.. మనకి ఓ క్లారిటీ వస్తుంది.

Xiaomi 14 ultra price in I...