భారతదేశం, మార్చి 11 -- దిగ్గజ సామాజిక మాధ్యమం ఎక్స్​ (గతంలో ట్విట్టర్​)పై సైబర్​ దాడి జరిగింది! అందుకే సోమవారం చాలా సేపు ఎక్స్​ పనిచేయలేదని అపరకుబేరుడు, సోషల్​ మీడియా సైట్​ ఓనర్​ ఎలాన్​ మస్క్​ వెల్లడించారు. ఈ సైబర్ ​దాడిలో ఒక దేశం లేదా వ్యవస్థీకృత సమూహం హస్తం ఉందని, పక్కా ప్రణాళికతో ఇదంతా జరిగిందని మస్క్​ వెల్లడించారు.

"ఎక్స్​పై భారీ సైబర్ దాడి జరిగింది (ఇప్పటికీ). ఇలాంటివి రోజు కనిపిస్తుంటాయి. కానీ ఇది చాలా వనరులతో జరిగింది. ఒక పెద్ద, సమన్వయ సమూహం లేదా ఒక దేశం హస్తం ఇందులో ఉండి ఉంటుంది. ట్రేసింగ్...," అని మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​లో మస్క్ రాసుకొచ్చారు.

కాగా ఎక్స్​లో అంతరాయంపై పట్ల పలువురు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డోజ్​లో మస్క్​ కార్యకలాపాలు, టెస్లా స్టోర్స్​పై దాడులు, నిరసనలు, తాజాగా ఎక్స్​పై సైబర్​ దాడిని లింక్​ చేస్...