భారతదేశం, ఫిబ్రవరి 6 -- వాట్ ఏ థ్రిల్లర్.. వాట్ ఏ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ.. సీట్ అంచున కూర్చోబెట్టే పోరు.. లాస్ట్ ఓవర్ డ్రామా.. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విక్టరీ. వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 టైటిల్ ను ఆర్సీబీ దక్కించుకుంది. గురువారం రాత్రి ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. 2024లోనూ ఆర్సీబీ విజేతగా నిలిచింది.

డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. రెండోసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీ దక్కించుకోవాలంటే ఈ టోర్నీ హిస్టరీలో ఇంతకుముందెప్పుడూ ఆర్సీబీ ఛేజ్ చేయని స్కోరును ఈ మ్యాచ్ లో చేయాలి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ విజయంపై ధీమాతోనే ఉండి ఉంటుంది. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమ...