భారతదేశం, ఏప్రిల్ 6 -- నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో లాగిన్​ అవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటోంది! ఎప్పుడు లాగౌట్​ అవుతామో ఎవరికీ తెలియదు అన్నట్టు ఉంది పరిస్థితి. మరీ ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగం వల్ల చాలా మంది వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో వర్క్​-లైఫ్​ బ్యాలెన్స్​పై చర్చ ఊపందుకుంది. ఏం చేసినా, మన ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. అందుకే, నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో వర్క్​- లైఫ్​ బ్యాలెన్స్​ కనుగొనడానికి తహతహలాడే వ్యక్తుల కోసం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం 5 స్టెప్స్​ని సూచించింది. వాటిని ఇక్కడ చూసేయండి..

1. పాస్​ అండ్​ డీ-నార్మలైజ్​: విరామం తీసుకోండి. ప్రతిరోజూ ఎక్కువ గంటలు పని చేసే చక్రాన్ని విచ్ఛిన్నం చేసి, దాన్ని తగ్గించండి. మీ పని తీరు, పనిగంటలు, ఒత్తిడి స్థాయి, ఇతర కా...