భారతదేశం, మార్చి 8 -- మార్చ్​ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, స్వాతంత్య్రం ప్రాముఖ్యతపై దృష్టి సారించడానికి ఇది సరైన సమయం! ఎప్పుడు జరుపుకునే వేడుకలకు అతీతంగా మహిళలు ఈసారి తమ ఆర్థిక స్వావలంబన సాధించే చర్యలపై దృష్టి పెట్టాలి. స్థిరమైన భవిష్యత్తును పొందడానికి ఆర్థిక అక్షరాస్యత, వ్యూహాత్మక పెట్టుబడులు కీలకం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి డైనమిక్ ప్రపంచం నుంచి బంగారం- రియల్ ఎస్టేట్ వంటి కాలాతీత ఆకర్షణ, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాల భద్రత వరకు, మహిళలు ఇన్వెస్ట్​ చేసందుకు ఉన్న ఉత్తమమైన ఆప్షన్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి సామర్థ్యం, వైవిధ్యత రెండింటినీ అందిస్తాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్స్ (సిప్) రెగ్యులర్- చిన్న మొత్తంలో పెట్టుబడులను అనుమతిస్తాయి. ఇవి విస్తృత శ్రేణ...