భారతదేశం, ఫిబ్రవరి 15 -- భారత్-అమెరికా మెగా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో కేంద్రం దిగుమతి సుంకాన్ని 150 శాతం నుంచి 50 శాతానికి తగ్గించడంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే బోర్బన్ విస్కీ ధరలు భారత్ లో గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చల నేపథ్యంలో బోర్బన్ విస్కీపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

బోర్బన్ విస్కీని భారత్ ప్రధానంగా అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటుంది. భారతదేశానికి దిగుమతి అయ్యే మొత్తం బోర్బన్ విస్కీలో అమెరికా వాటా నాలుగింట ఒక వంతు ఉంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ నోటిఫికేషన్ ప్రకారం బోర్బన్ విస్కీ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 150 శాతం నుంచి 50 శాతానికి భారత్ తగ్గించింది.

భారతదేశంలో అమ్ముడయ్యే యూఎస్ మేడ్ బోర్బన్ విస్కీ కి సంబంధించి రెండు ప్రధాన బ్రాండ్లు ఉన...