భారతదేశం, ఫిబ్రవరి 25 -- Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడుల్ని నివారించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుని ఐదు నెలలు దాటింది. గత ఏడాది ఆగస్టు 8న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ స్వయంగా బెంగుళూరు వెళ్లి కుంకీ ఏనుగుల కోసం సీఎం సిద్ధరామయ్యను అభ్యర్థించారు.

ఆ తర్వాత కర్ణాటక అటవీ శాఖతో గత ఏడాది సెప్టెంబర్‌ 27న కుంకీ ఏనుగుల కోసం విజయవాడలో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలో శిక్షణ పొందిన ఏనుగులతో ఏపీకి చెందిన అటవీ సిబ్బంది శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఐదు నెలలు గడిచినా కుంకీ ఏనుగుల జాడ మాత్రం లేదు.

కర్ణాటక నుంచి 8 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ పంపేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సెప్టెంబర్‌ 27న విజయవాడలో అవగాహన ఒప్పందం జరిగింది. దీంతో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు వచ్చేస్తాయన...